నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ - actor shravani murder case latest update
17:30 September 27
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన కస్టడీ
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ప్రధాన నిందితులుగా ఉన్న సాయికృష్ణా రెడ్డి, దేవరాజ్ లను లోతుగా విచారించిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు ఇద్దరి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. శ్రావణి-దేవరాజ్ల ఫోన్ కాల్స్ రికార్డులకు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించారు. శ్రావణి ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాలపై మరోమారు ఇద్దరి స్టేట్మెంట్లను రికార్డు చేశారు.
ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి ఇంట్లో సాయికృష్ణా రెడ్డి ప్రవర్తించిన తీరుపై పోలీసులు అతడిని ఆరా తీశారు. ఈనెల 7న దేవరాజ్-శ్రావణి కలుసుకున్న బేగంపేటలోని రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. జరిగిన పరిణామాలపై మరోసారి విచారించారు. పూర్తి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ మేరకు నిందితులను రేపు న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.
ఇదీ చూడండి: క్రైం థ్రిల్లర్: బుల్లితెర నటి ఆత్మహత్యకు కారణమేంటి?