తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు మనదే, ముఖ్యమంత్రి పీఠం మనదే నినాదంతో ముందుకు'

బంగారు తెలంగాణలో మంగళసూత్రాలు, భూములు తాకట్టుపెట్టి చదువుకోవాలా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని దుయ్యబట్టారు.

జాజుల శ్రీనివాస్​గౌడ్
జాజుల శ్రీనివాస్​గౌడ్

By

Published : Jan 8, 2023, 7:37 PM IST

చదువు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పాలమూరు నుంచి పట్నం వరకు బీసీ పోరుయాత్ర ముగింపు సభ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయిందని.. విద్యార్థులతో చెలగాటమాడటం ప్రభుత్వం మానుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు.

దొరల ప్రభుత్వాన్ని పొలిమేర వరకు తరిమి కొట్టడానికి మరో ఉద్యమం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అగ్రకుల పేదలను కలుపుకొని 93 శాతం ఉన్న మనం ముఖ్యమంత్రి పీఠం సాధిద్దామని ఆయన అన్నారు. 2023లో ఓటు మనదే, ముఖ్యమంత్రి పీఠం మనదే నినాదంతో ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. సంపద సృష్టించే బీసీలకు అప్పుల్లో వాటా ఇస్తారు, సంపదలో వాటా ఇవ్వరా అని నిలదీశారు. రాష్ట్రం ఆనంద నిలయం కాదు.. అప్పుల నిలయంగా మార్చారని విమర్శించారు.

దొరల ప్రభుత్వాన్ని అంతమొందించడానికి నిర్మాణాత్మక పోరాటానికి సిద్ధం కావాలని జాజుల సూచించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్​ను బీసీ విద్యార్థి, యువజన, మహిళ సంఘాల నాయకులు గజమాలతో సన్మానించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details