అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టిన అధికారులు... నేడు ముగింపు వేడుకలు నిర్వహించారు. హైటెక్స్ మైదానంలో అగ్నిమాపక వివిధ శకటాలను ప్రదర్శించి వాటితో ర్యాలీగా బయలుదేరారు. హైటెక్స్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ మెహదీపట్నం లక్డీకాపూల్ మీదుగా సికింద్రాబాద్ వరకు సాగింది.
హైటెక్స్‌లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకలు - తెలంగాణ వార్తలు
అగ్నిమాపక యంత్రాల పనితీరు మెరుగ్గా ఉంటేనే ప్రమాదాలను త్వరితగతిన నివారించవచ్చనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు అగ్నిమాపక డైరక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా నేడు ముగింపు వేడుకలు నిర్వహించారు.
హైటెక్స్‌లో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు వేడుకలు
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అగ్నిమాపకశాఖ డైరక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సంవత్సరం 'అగ్నిమాపక యంత్రాల పనితీరు మెరుగ్గా ఉంటేనే ప్రమాదాలను త్వరితగతిన నివారించవచ్చనే' నినాదంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీలో వివిధ రకాల 20 అగ్నిమాపక శకటాలను ప్రదర్శించారు.
ఇదీ చూడండి:దొంగ ఓట్లపై ఆడియో కలకలం.. సామాజిక మాధ్యమాల్లో వైరల్