టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు సీరియస్
11:52 April 29
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు సీరియస్
టీఎస్పీఎస్సీకి ఛైర్మన్ నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఛైర్మన్, సభ్యులను నియమించాలని ఆదేశించింది. ఛైర్మన్, సభ్యులను నియమించకుంటే టీఎస్పీఎస్సీని మూసేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఛైర్మన్, సభ్యులను నియమించి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగి జె.శంకర్ పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిల్‌పై తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి :40 ఏళ్లలోపు వారే లక్ష్యంగా కొవిడ్ కాటు