తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భం కోసం వికట ప్రయోగాలు

సంతానసాఫల్య కేంద్రాలు అపాయకర పద్ధతులు అవలంబిస్తున్నాయి. అమాయకులపై వికట ప్రయోగాలు చేస్తున్నాయి. మాయమాటలతో నమ్మించి ఉపాధి శిక్షణ కోసం నగరానికి వచ్చిన ఓ అమాయకురాలి  జీవితంతో ఆడుకుంది ఓ సంస్థ.

అమాయకుల జీవితాలతో ఆటలు

By

Published : Mar 7, 2019, 12:02 AM IST

అమాయకుల జీవితాలతో ఆటలు
హైదరాబాద్‌కి ఉపాధి శిక్షణ కోసం కామారెడ్డి నుంచి వచ్చిన ఓ యువతిపై వైద్య ప్రయోగాలు చేసి ఆసుపత్రిపాలు చేసింది ఓ ప్రైవేటు సంస్థ. గర్భం దాల్చేలా... బంజారాహిల్స్‌లోని ఓ సంతానసాఫల్య కేంద్ర​ నిర్వాహకులు కొన్ని క్లినికల్​ ట్రయల్స్​ చేశారు. మందులు కాస్తా వికటించటంతో వారం రోజులుగా బాధితురాలు కడుపునొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతోంది. పరిస్థితి విషమించిందని గ్రహించి, అప్రమత్తమైన నిర్వాహకులు... యువతిని ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యారు.

పొట్ట కూటి కోసం వచ్చిన తమ కుమార్తెపై ప్రయోగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని... న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details