తెలంగాణ

telangana

ETV Bharat / state

జులై 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు: మంత్రి సబితా - Telangana news

Sabitha indra reddy
మంత్రి సబితా

By

Published : Jun 21, 2021, 8:08 PM IST

Updated : Jun 21, 2021, 9:23 PM IST

20:06 June 21

జులై 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు: మంత్రి సబితా

జులై 1 నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులకు తరగతులు

 జులై 1 నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులుంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇంటర్, ఆపై అన్ని తరగతులకు ప్రత్యక్ష బోధన ఉంటుందని తెలిపారు. తరగతుల విషయమై ఎల్లుండి విధివిధానాలు వెల్లడిస్తామన్నారు.  

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు వచ్చే వారం విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌, డిప్లమో ఫైనలియర్‌ పరీక్షలు జులైలో పూర్తి చేస్తామన్నారు. జులై 31లోపు డిగ్రీ, పీజీ ఫైనలియర్‌ పరీక్షలు కూడా పూర్తి అవుతాయన్నారు. టీచర్లు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్‌పై ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు.  

ఎల్లుండి ప్రైవేట్ విద్యాసంస్థలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గతేడాదివలే ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్లు సూచించారు. ఈ ఏడాది 30 శాతం ఫీజులు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తామని ఉద్ఘాటించారు.  

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలను వచ్చే వారం విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఇంజినీరింగ్‌, డిప్లమో ఫైనలియర్‌ పరీక్షలు జులైలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. ఆగస్టు 4 నుంచి సెట్​కు సంబంధించిన అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తాం. కొవిడ్ నిబంధనలకనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తాం.

 -- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

ఇదీ చూడండి:KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది

Last Updated : Jun 21, 2021, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details