తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి' - 'ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి'

ఆంధ్రప్రదేశ్​లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్​ చేస్తూ హైదరాబాద్ నాంపల్లిలోని క్లాస్​4 ఉద్యోగులు... క్లాస్4 ఉద్యోగుల సంఘం రా​ష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

class four employees protest in hyderabad for job replacement
'ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి'

By

Published : May 30, 2020, 7:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్లాస్​4 ఉద్యోగులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర క్లాస్4 ఉద్యోగుల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే స్వరాష్ట్రంలో పనిచేసుకోవచ్చని.. తాము ఉద్యమ సమయంలో ముందుండి పోరాడామని... ఇప్పుడా ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు లాక్​డౌన్​ వల్ల అక్కడికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏపీలో పనిచేస్తున్న 400 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details