ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఏఈఎల్‌సీ సంస్థలో వివాదాలు ముదిరాయి. నార్త్ ప్యారిస్ చర్చిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశి బాబు, శ్యామ్ సంపత్ పాస్టర్లకు చెందిన ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా... శ్యామ్ సంపత్ వర్గం పాస్టర్ కెన్నెడీ తమకు కోర్టు అనుమతిచ్చిందని చర్చిలోకి వచ్చారు.
చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్ - నార్త ప్యారీస్ చర్చి
ఏపీలోని గుంటూరులో నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ ఒక వర్గం వారు.. తమకు కోర్టు అనుమతి ఇచ్చిందని మరో వర్గం వారు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల వారు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు.
Church controversy
ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఘర్షణకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టారు. చర్చి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఇవీ చదవండి: