హైదరాబాద్ హిమాయత్‌నగర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. డివిజన్లోని ఫరీదా బస్తీలో తెరాస అభ్యర్థి హేమలత యాదవ్ ప్రచారం నిర్వహించగా... తమకు వరదసాయం అందలేదని బస్తీవాసులు ఆమెను నిలదీశారు. అభ్యర్థి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం వల్ల తమ బస్తీలో ప్రచారం చెయ్యవద్దంటూ మహిళలు అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట - ghmc elections latest news
హిమాయత్‌నగర్ డివిజన్లోని ఫరీదా బస్తీలో తెరాస అభ్యర్థికి నిరసన సెగ తగిలింది. తమ బస్తీలో ప్రచారం చేయవద్దంటూ మహిళలు వెళ్లగొట్టగా... బస్తీవాసులకు భాజపా నాయకులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో భాజపా, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
![భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట Clashes between BJP and Trs activists at himayath nagar in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9641251-846-9641251-1606151084290.jpg)
భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట
విషయం తెలుకున్న భాజపా నాయకులు బస్తీ వాసులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా భాజపా, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఇవీ చూడండి: 'ఎన్నికల తర్వాత ప్రతి ఒక్కరికి వరదసాయం అందిస్తాం'