YCP activists attack on TDP leaders Marcharla: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో వైకాపా కార్యకర్తలు అక్కడకు చేరుకుని తెదేపా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కర్రలతో తెదేపా వారిపై దాడి చేశారు.
రణరంగమైన మాచర్ల.. రాళ్లు, గాజు సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి - macharlafight between tdp and ycp
YCP activists attack on TDP leaders Marcharla: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగమైంది. తెదేపా కార్యకర్తలు చేపట్టిన ర్యాలీపై వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో విరుచుకుపడ్డారు. దీంతో మాచర్ల పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
![రణరంగమైన మాచర్ల.. రాళ్లు, గాజు సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి Clash between Tedepa and Vaikapa ranksdepa and Vaikapa ranks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17226691-43-17226691-1671197930791.jpg)
Palnadu tension
రణరంగమైన మాచర్ల.. రాళ్లు, గాజు సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి
తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారిపై తిరగబడ్డారు. రాళ్లతో ప్రతిదాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ గొడవలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రతిపక్ష పార్టీ నిర్వహించే కార్యక్రమానికి ఆటంకాలు సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
రణరంగమైన మాచర్ల.. రాళ్లు, గాజు సీసాలతో తెదేపా కార్యకర్తలపై దాడి
ఇవీ చదవండి:
Last Updated : Dec 16, 2022, 10:13 PM IST