తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల మధ్య ముళ్ల కంచెలు...ఘర్షణలు

పలు గ్రామాల్లో రోడ్లపై కంప వేయడం వివాదాలకు దారి తీస్తోంది. లాక్​డౌన్ పరిస్థితుల్లో ఎవరూ వారి గ్రామాల్లోకి రాకూడదని హెచ్చరికలు చేయడమే కాకుండా గ్రామాల్లోకి ప్రవేశించకుండా ముళ్ల కంచెలు వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ పలువురు ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారు.

By

Published : Apr 5, 2020, 4:13 PM IST

Updated : Apr 5, 2020, 5:17 PM IST

clash-between-two-villages-over-corona-fear
గ్రామాల మధ్య కంప కంచెలు...ఘర్షణలు

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో రోడ్లపై కంప వేయడం వివాదాలకు దారితీస్తోంది. లాక్​డౌన్ పరిస్థితుల్లో ఎవరూ వారి గ్రామాల్లోకి రాకూడదని హెచ్చరికలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులో కంప వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు గ్రామాల్లోకి పోలేని పరిస్థితి ఉంది.

విడవలూరు మండలంలో లక్ష్మీపురం, కొత్తూరు గ్రామాల మధ్య కంప వేసుకున్నారు. కొందరు తీయాలని కోరడం... మరికొందరు కుదరని చెప్పడంతో వివాదం పెరిగి.. రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. ఈఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు చెదరగొట్టారు. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ... నెల్లూరు: ముందు పాజిటివ్.. తర్వాత నెగెటివ్

Last Updated : Apr 5, 2020, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details