హైదరాబాద్ కూకట్పల్లి జాతీయ రహదారిపై రైతు దీక్షకు మద్దతుగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెరాస నాయకులు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలను పక్కకు వెళ్లమని పోలీసులు చెప్పారు. అయితే వారిని పట్టించుకోకుండా రెండు గంటలకు పైగా... రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేశారు.
పోలీసులు, తెరాస నాయకులకు మధ్య తోపులాట - latest news in Telangana
భారత్ బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. కూకట్‌పల్లిలో తెరాస నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తుండగా... పోలీసులు వారిని పక్కకు వెళ్లమన్నారు. దీనితో పోలీసులు, తెరాస నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

బంద్‌లో పోలీసులకు, తెరాస నాయకులకు మధ్య తోపులాట
ఈ ప్రయత్నంలో తెరాస నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొద్దిసేపటికి పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని తెరాస నాయకులను అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చదవండి:వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్