ఇందూరు పంచాయితీ.. ఎంపీ అర్వింద్ ఎమ్మెల్సీ కవితల మధ్య మాటల యుద్ధంతో భాజపా, తెరాస శ్రేణులు ఆందోళనకు దిగాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో వరంగల్, ఖమ్మం రహదారిపై భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగటంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భాజపా నేతలు రాస్తారోకో చేశారు.
ఇందూరు పంచాయితీ.. తెరాస, భాజపా శ్రేణుల పోటాపోటీ ఆందోళనలు - Clash between BJP and Terasa
ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు, ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనలతో రాష్ట్రంలో తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి. అర్వింద్ తీరును నిరసిస్తూ గులాబీదళం రోడ్డెక్కగా.. అధికార పార్టీ అండతో ఎంపీ ఇంటిపై దౌర్జన్యం చేశారంటూ కమలదళం నిరసనలు చేపట్టింది.
నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్‌లో భాజపా శ్రేణులు నిరసన చేపట్టారు. హనుమకొండ జిల్లా పరకాలలో భాజపా శ్రేణులు ఆందోళనకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాసేపు తోపులాట నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో భాజపా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎమ్జే మార్కెట్ కూడలిలో తెరాస కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నిరసన చేపట్టే క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఇవీ చదవండి: