తెలంగాణ

telangana

ETV Bharat / state

కొలంబియా యూనివర్సిటీని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్​.వి.రమణ - CJI Justice NV Ramana at columbia university

అమెరికా పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శుక్రవారం న్యూయార్క్​ నగరంలోని కొలంబియా యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో ఉన్న డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు.

కొలంబియా యూనివర్సిటీని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్​.వి.రమణ
కొలంబియా యూనివర్సిటీని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్​.వి.రమణ

By

Published : Jun 24, 2022, 8:04 PM IST

కొలంబియా యూనివర్సిటీలో జస్టిస్ ఎన్​.వి.రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం న్యూయార్క్​ నగరంలోని కొలంబియా యూనివర్సిటీని సీజేఐ సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో ఉన్న డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. అనంతరం 'స్కాలర్స్​ లయన్'​ వద్ద కాసేపు సరదాగా గడిపారు.

'స్కాలర్స్​ లయన్'​ వద్ద సీజేఐ

రేపు వర్జీనియాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ డీసీ ఆధ్వర్యంలో జరగనున్న మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణ పాల్గొంటారు. సీజేఐ గౌరవార్థం మిల్పిటాస్‌లో జులై 1న అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రవాస భారతీయులను ఉద్దేశించి సీజేఐ ప్రసంగిస్తారు.

కొలంబియా యూనివర్సిటీలో జస్టిస్ ఎన్​.వి.రమణ

అంతకుముందు న్యూయర్క్‌ విమానాశ్రయంలో జస్టిస్​ ఎన్​.వి.రమణకు గురువారం ఘనస్వాగతం పలికారు. భారత్‌ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్రా ఎల్ల, భారత కాన్సులెట్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్, తానా పూర్వ అధ్యక్షులు జయ్ తాళ్లూరి, తానా ప్రముఖులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ తదితరులు ఎన్.వి.రమణకు స్వాగతం పలికారు.

ABOUT THE AUTHOR

...view details