తెలంగాణ

telangana

ETV Bharat / state

JUSTICE NV RAMANA: జస్టిస్ పి.కేశవరావు మృతి పట్ల సీజేఐ సంతాపం - తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మృతి పట్ల సీజేఐ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కేశవరావు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జస్టిస్ కేశవరావు సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

JUSTICE NV RAMANA about justice keshava rao, JUSTICE NV RAMANA about telangana high court justice
జస్టిస్ పి.కేశవరావు మృతి పట్ల సీజేఐ సంతాపం, జస్టిస్ కేశవరావు మృతిపై సీజేఐ విచారం

By

Published : Aug 9, 2021, 5:37 PM IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరణంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(JUSTICE NV RAMANA) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన 35 ఏళ్ల సుదీర్ఘ కాలంలో న్యాయం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. జస్టిస్ కేశవరావు మృతి తెలంగాణ హైకోర్టుకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సేవలు మరువం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 3.47 గంటలకు తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు 1961 మార్చి 29న జన్మించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, ఎల్ఎల్​బీ పూర్తి చేశారు. 1986లో బార్ కౌన్సిల్​లో ఎన్​రోల్ చేసుకుని న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. పలు కీలకమైన సివిల్, క్రిమినల్ కేసులను విజయవంతంగా వాదించారు. 1991 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సీబీఐ, జీహెచ్​ఎంసీ, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.

సీఎం సంతాపం

2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.కేశవరావు సేవలందించారు. ఆయన మృతితో హైకోర్టు.. నేడు రాష్ట్రంలోని కోర్టులకు సెలవు ప్రకటించింది. జస్టిస్ పి.కేశవరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలియజేశారు. పేదలకు ఆయన అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు.

ఇదీ చదవండి:హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.కేశవరావు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details