సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రానికి వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయన... నేరుగా రాజ్‌భవన్‌కు తరలివెళ్లారు.
రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. మూడురోజుల పాటు జస్టిస్ ఎన్వీ రమణ రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. ఈ 3 రోజులు పలు కార్యక్రమాలు, సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు. రాజ్‌భవన్‌లో కార్యక్రమ అనంతరం ఎస్ఆర్ నగర్‌లోని బాపు నగర్లో గల ఆయన స్వగృహానికి వెళ్లారు.