సివిల్స్ ప్రిలిమ్స్(civils prelims exam) ఉత్తీర్ణులైన బీసీ యువతకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మెయిన్స్‌కు(mains) అవసరమైన కోచింగ్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. పరీక్షకు సిద్దం కావడానికి అర్హులైన అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Civils Coaching: అర్హులైన అభ్యర్థులకు ఉచిత కోచింగ్: బుర్రా వెంకటేశం - బీసీ స్టడీ సర్కిల్
దేశంలో అత్యున్నత సర్వీసులకు నిర్వహించే సివిల్స్ మెయిన్స్(civils mains exam) పరీక్షకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రిలిమ్స్ పాసై ఆసక్తి గల అభ్యర్థులు తమ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఉచిత కోచింగ్
సివిల్స్-2021లో ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన బీసీ యువత ఈ నెల 15వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఉచిత కోచింగ్ కోసం tsbcstudycircle.cgg.gov.in వెబ్సైట్లో తమ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు జత చేయాలని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్ 040- -24071178లో సంప్రదించాలని బుర్రా వెంకటేశం వివరించారు.
ఇదీ చూడండి: