తెలంగాణ

telangana

ETV Bharat / state

మే నెల సరఫరాకు పౌరసరఫరాల సంస్థ కసరత్తు - telangana civil supply

బ్యాంకు ఖాతాలు లేని రేషన్ కార్డుదారులకు తపాలా ద్వారా రూ.1500 నగదు అందిస్తున్నారు. ఐదు లక్షలకు పైగా తెల్లరేషన్ కార్డుదారుల ఆధార్‌కు బ్యాంకు ఖాతాల అనుసంధానం లేని నేపథ్యంలో ఈ ఏర్పాటు చేశారు. తపాలా కార్యాలయాల నుంచి కూడా పలువురు ఇప్పటికే నగదు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

civil supply
మే నెల బియ్యం సరఫరాకు పౌరసరఫరాల సంస్థ కసరత్తు

By

Published : Apr 24, 2020, 8:40 AM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 23 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్​ ప్రకటించింది. నిరుపేదల కోసం బియ్యం, నగదును ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న 82 లక్షల తెల్లరేషన్ కార్డుదారులు ఒక్కో వ్యక్తికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ. 1500 నగదును ఏప్రిల్ నెలకు అందించారు. ఏప్రిల్ నెలలో 3.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ అందించింది. 92 శాతం మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకున్నట్లు సర్కారు తెలిపింది.

సాధారంగా ప్రతి నెలా పౌరసరఫరాల సంస్థ ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున లక్ష యాభై వేల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తారు. దాదాపు 80 నుంచి 85 శాతం వరకు రేషన్ కార్డుదారులు రూపాయికి కిలోబియ్యం తీసుకునేవారు.

మే నెలకు కూడా ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఏప్రిల్ పంపిణీని ఇక నిలిపివేశారు. మే నెల సరఫరాకు సిద్ధమవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

ఇక ఒక్కో కుటుంబానికి రూ. 1500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తెల్లరేషన్ కార్డుదారుల ఆధార్ అనుసంధానం ద్వారా ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఆధార్​తో బ్యాంకు ఖాతాలు అనుసంధానం లేని వారికి తపాలా శాఖ ద్వారా నగదును పంపిణీ చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం చెల్లింపులు, ఆసరా ఫించన్లను తపాలా శాఖ ద్వారానే చేస్తున్నారు. దీంతో మిగిలిన వారిలో లక్షమందికిపైగా తపాలా ఖాతాలు ఉన్నాయి. రేషన్, ఆధార్ కార్డుల సాయంతో వారికి కూడా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తపాలా కార్యాలయాల నుంచి కూడా నగదు తీసుకుంటున్నారని పౌరసరఫరాలశాఖ చెబుతోంది.

ఏప్రిల్ నెలలో బియ్యం పంపిణీ, నగదు జమ ప్రక్రియతో స్పష్టత వచ్చిందని... మే నెలలో పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మే నెల మొదటి వారంలోనే నగదు జమ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, బియ్యం పంపిణీ కూడా త్వరగానే పూర్తి చేస్తామని తెలిపింది.

ఇవీచూడండి:మెతుకు సీమను తాకనున్న గోదారమ్మ

ABOUT THE AUTHOR

...view details