తెలంగాణ

telangana

ETV Bharat / state

సివిల్​ సప్లై గోదాములను తనిఖీ చేసిన అధికారులు - rangareddy news

హైదరాబాద్ నగర శివారుల్లోని సివిల్ సప్లై గోదాములను రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ తనిఖీ చేశారు. సన్నబియ్యం, ప్రజాపంపిణీ బియ్యానికి సంబంధించిన సేకరణ, నిల్వలు, జారీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

civil supply chirmen inspection in hyderabad
civil supply chirmen inspection in hyderabad

By

Published : Sep 8, 2020, 8:27 AM IST

హైదరాబాద్ నగర శివారుల్లోని సివిల్ సప్లై గోదాములను రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ కె. తిరుమల్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని మైలర్​దేవపల్లి, బండ్లగూడా జాగీర్​లో గల ఎమ్​ఎల్పీ పాయింట్ సర్కిళ్లలోని గోదాములను తనిఖీ చేశారు.

ముఖ్యంగా సన్నబియ్యం, ప్రజాపంపిణీ బియ్యానికి సంబంధించిన సేకరణ, నిల్వలు, జారీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ జిల్లా సీఆర్ఓ బి. బాలమాయాదేవి, ఐఏఎస్, డీసీ ఎస్వోపీ పద్మ, జిల్లా మేనేజర్​ సీహెచ్ తనుజ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:28 వరకు శాసనసభ వర్షాకాల సమావేశాలు..ఈనెల 9న రెవెన్యూ బిల్లు

ABOUT THE AUTHOR

...view details