ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే భారత ధాన్యాగారంగా తెలంగాణ అవతరించిదని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. యాసంగి సీజన్‌లోనూ రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించడం రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పౌరసరఫరాల భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ యాసంగి సీజన్‌లో 39 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు అవ్వగా మొత్తం 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభించిందని తెలిపారు. ఇప్పటి వరకు 6804 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటించారు.