తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖరీఫ్​లో రికార్డుస్థాయి ధాన్యం దిగుబడి అవుతుంది'

దేశంలో ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

'ఖరీఫ్​లో రికార్డు స్థాయి ధాన్యం దిగుబడి అవుతుంది'

By

Published : Nov 15, 2019, 10:58 AM IST

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, 24గంటల విద్యుత్​, రైతుబంధు వంటి పథకాలతో సాగు విస్తీర్ణం పెరిగిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పటిష్ఠ నిఘా

పక్క రాష్ట్రాలకు చెందిన దళారులు, వ్యాపారులు... రైతుల పేరుతో తెలంగాణలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సరిహద్దులో పటిష్ఠ నిఘాతో దీన్ని ఆరికట్టాలని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.

3,406 కేంద్రాలు

తెలంగాణ రైతులకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు అందుబాటులో ఉండేలా 3,406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

అవగాహన అవసరం

రైతులు ధాన్యం విక్రయించే సమయంలో తేమశాతాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు రైతులకు మరింత అవగాహన కల్పించాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details