హైదరాబాద్లో సివిల్స్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జనరల్ స్టడీస్ పేపర్... మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సీశాట్ రెండో పేపర్ నిర్వహిస్తారు. హైదరాబాద్లో 46,171 మంది అభ్యర్థుల కోసం 99 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పటిష్ఠ ఏర్పాట్లు: సివిల్ ప్రాథమిక పరీక్ష ప్రారంభం - హైదరాబాద్ తాజా వార్తలు
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రారంభమైంది. ఉప్పల్లోని కేంద్రీయ విద్యాలయలంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తెల్లవారుజాము నుంచే అభ్యర్థులు చేరుకున్నారు.
![పటిష్ఠ ఏర్పాట్లు: సివిల్ ప్రాథమిక పరీక్ష ప్రారంభం ప్రశాంతంగా ప్రారంభమైన సివిల్సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9042621-thumbnail-3x2-civils-rk.jpg)
ప్రశాంతంగా ప్రారంభమైన సివిల్సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష
ఆలస్యంగా రావడం వల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని పరీక్షా కేంద్రంలో ఇద్దరిని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. నిర్ధేశించిన సమయానికి సివిల్స్ పరీక్ష కేంద్రానికి వచ్చినా తనను లోపలికి అనుమతించలేదని ఓ అభ్యర్థి పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని అరోరా కళాశాల వద్ద చోటుచేసుకుంది. ఆయా పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు కొవిడ్-19 నియమాలకు కట్టుబడి మాస్కు ధరించి, చేతికి గ్లౌజులు వేసుకుని వచ్చారు.
ఇదీ చూడండి:నేడు సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష
Last Updated : Oct 4, 2020, 10:55 AM IST