తెలంగాణ

telangana

ETV Bharat / state

సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగో ఆవిష్కరణ - Hcsc Logo Launch

హైదరాబాద్... దేశంలోని ఇతర నగరాలకు నమూనాగా నిలిచిందని శాంతిభద్రతల అదుపులో ఉండటం వల్ల పెట్టుబడులు తరలివస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పంజాగుట్టలో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగోను ఆవిష్కరించారు.

City Security Council logo launch event in Hyderabad
సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగోను ఆవిష్కరణ

By

Published : Feb 13, 2020, 8:00 PM IST

Updated : Feb 13, 2020, 10:37 PM IST

హైదరాబాద్ బేగంపేటలో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగోను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లోగోను హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. హైదరాబాద్ మహానగరం... దేశంలోని ఇతర నగరాలకు నమూనాగా నిలిచిందని శాంతిభద్రతల అదుపులో ఉండటం వల్ల దేశవిదేశాల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సైబరాబాద్​లో గత పదకొండేళ్లుగా కొనసాగుతున్న సొసైటీ ఫర్ సైబర్ సెక్యురిటీ మాదిరిగానే సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ పనిచేయనున్నట్లు తెలిపారు.

ఈ కౌన్సిల్​కు అంజనీ కుమార్ ఛైర్మన్​గా వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రత, ట్రాఫిక్ సమస్యలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కలిగించి... వాటి బారిన పడకుండా సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ స్వచ్ఛందంగా పనిచేస్తుంది. పలుపురు పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపార సంస్థల ప్రతినిధులు సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​లో సభ్యులుగా వ్యవహరిస్తారు.

సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ లోగో ఆవిష్కరణ

ఇవీ చూడండి:అక్కన్నపేటలో కాల్పుల కలకలం

Last Updated : Feb 13, 2020, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details