తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2021, 12:47 PM IST

ETV Bharat / state

'నగరంలో ఎక్కడ చెత్త కనిపించొద్దు'

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు పారిశుద్ధ్య పనులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా పరిశీలించారు. నేటి నుంచి నాలుగు రోజులపాటు చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్​ను ప్రారంభిచారు.

City Mayor Gadwal Vijayalakshmi latest news
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో జరుగుతున్న పలు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్​ను ప్రారంభించారు. ఖైరాతాబాద్ జోన్​లోని గుడిమల్కాపూర్ డివిజన్, సంతోష్ నగర్ కాలనీలో చెత్తను చూసి స్థానిక అధికారులను మందలించి... వెంటనే చెత్తను తీసివేయాలని హెచ్చరించారు.

రెడ్ హీల్స్ డివిజన్​లోని మొఘల్ ఖానా నాలా వద్ద చెత్తను చూసి వెంటనే అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు చెప్పి తీయించారు. రామ్ సింగ్ పూరలో జనాలు రోడ్డు మీద చెత్త వేయడం చూసి వారికి అలా వేయవద్దని అవగాహన కల్పించారు. జియగూడలోని డంపింగ్ యార్డ్​లో రాంకీ ప్లాంట్ పనిచేయకాపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండడం చూసి అసహనానికి గురైన మేయర్ వారిని వెంటనే మరమ్మతులు చేసి పనిని ప్రారభించాలని చెప్పారు. మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలోని రోడ్డు మీద ఒక కిలో మీటర్ వరకు చెత్త ఉండడం చూసి మేయర్ కంగుతిన్నారు. స్థానిక డిప్యూటీ కమిషనర్​ను పిలిపించి వెంటనే తీయించాలని ఆదేశించారు. ఖైరతబాద్ జోన్​లో చాలా చోట్ల చెత్త నిల్వ ఉందని వెంటనే వాటి మొత్తాన్ని తీపించాలని జోనల్ కమిషనర్​ను ఆదేశించారు. నగరంలో ఎక్కడ కూడా చెత్త నిల్వలు కనపడ వద్దని మేయర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: శ్రీమంతులు కాకపోయినా.. ఆకలి తీరుస్తున్న దాతలు

ABOUT THE AUTHOR

...view details