తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు - city buses back on tomorrow in hyderabad

city-buses-will-start-in-hyderabad-from-tomorrow
హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

By

Published : Sep 24, 2020, 7:13 PM IST

Updated : Sep 24, 2020, 8:33 PM IST

17:33 September 24

హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు

     హైదరాబాద్‌లో రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ సూచన మేరకు సీఎం కేసీఆర్​ ఒప్పుకున్నారు. హైదరాబాద్‌లో ముందుగా 25 శాతం సిటీ బస్సులు నడుపుతామని మంత్రి పువ్వాడ ప్రకటించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూనే బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

    మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఆర్టీసీ బస్సులు కూడా శుక్రవారం నుంచి తిరగనున్నాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా గత మార్చి 22 నుంచి నగరంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. తిరిగి జంటనగరాల్లో దాదాపు 6 నెలల తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సిటీ బస్సులు ప్రారంభం అవుతున్న వేళ రోజు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే ఉద్యోగులు, కార్మికులకు ఉపశమనం లభించనుంది.

ఇదీ చూడండి :'గాంధీ, ఉస్మానియా తర్వాత మహబూబ్​నగర్​లోనే'

Last Updated : Sep 24, 2020, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details