వైద్యారోగ్య శాఖలో పనిచేస్తోన్న ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించటంతో పాటు... కనీస వేతనాల ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను చేపట్టారు. గాంధీ ఆస్పత్రి ఒప్పంద ఉద్యోగులు గంటపాటు విధులు బహిష్కరించి ఆందోళనకి దిగారు. వేతనాలను రూ.21వేలకు పెంచితేనే తమకు ఇళ్లు గడుస్తుందని వాపోయారు. పదేళ్లుగా తమను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా... ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'15 ఏళ్లుగా సేవలందిస్తున్నాం... క్రమబద్ధీకరించడం లేదు' - hyderabad latest updates
పదిహేనేళ్లుగా సేవలందిస్తున్న తమని వెంటనే క్రమబద్ధీకరించి... వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రి ఒప్పంద ఉద్యోగులు నిరసన చేపట్టారు. గంటపాటు విధులు బహిష్కరించి ర్యాలీ చేశారు. తమని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
'15 ఏళ్లుగా సేవలందిస్తున్నాం... క్రమబద్ధీకరించడం లేదు'
పదిహేనేళ్లుగా ఒప్పంద ఉద్యోగులుగా సేవలందిస్తున్నా... ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఇదీ చదవండి:ఆస్పత్రి ఎదుట ఉద్యోగ సంఘాల ఆందోళన