ఏపీ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌లో ఎంపీ విజయసాయి రెడ్డికి భంగపాటు కలిగింది. బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ విజయసాయి రెడ్డి కారు దిగి ఆందోళనకారుల వద్దకు వెళ్లారు. 'ఇదేం బంద్ చేయడం, రోడ్లపై కార్లన్నీ వెళ్లిపోతున్నాయి' అనడంతో.. సీఐటీయూ నాయకుడు ఆర్కేఎస్వీ కుమార్ కలగజేసుకుని... 'మేం ఉదయం నుంచి బంద్ చేస్తున్నాం. మీరు, మీ పార్టీవారు ఇప్పుడే వచ్చారు' అనడంతో వైకాపా నేతలు ఆయనకు సర్దిచెప్పారు.
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి భంగపాటు.. - citu leader question to vijayasai reddy on steel plant in maddilapalem kundali
ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మద్దిలపాలెం కూడలిలో అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌లో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి భంగపాటు ఎదురైంది. విజయసాయిరెడ్డి మైకు పట్టుకుని కార్మిక సంఘాల నేతలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటుండగా.. సీఐటీయూ కార్యకర్త మాట్లాడారు. పోస్కోతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయించాలని విజయసాయి రెడ్డితో ఆయన అన్నారు.
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి భంగపాటు..
తర్వాత విజయసాయి రెడ్డి మైకు చేతపట్టుకుని కార్మికులు, నాయకులకు సూచనలు చేస్తూ మానవహారం ఏర్పాటు చేయించారు. పోస్కోతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయించాలని ఈ సందర్భంగా కార్యకర్త సురేష్ అనగా.. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోయారు.
- ఇదీ చూడండి: 75వ స్వాతంత్య్ర దినోత్సవ కమిటీలో కేసీఆర్, జగన్