హైదరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో హెచ్డీసీ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతూ కవాడిగూడలోని కార్మిక బీమా ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గత 16 నెలలుగా జీతాలు చెల్లించకుండా వారితో పనులు చేయించుకుంటున్నారని కార్మికులు ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించే ప్రయత్నం మానుకుని వారిని యథావిధిగా విధుల్లోకి కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
జీతాలు చెల్లించాలంటూ ఈఎస్ఐ డిస్పెన్సరీ హెచ్డీసీ కార్మికుల ధర్నా - citu dharna at kavadiguda to pay salaries for esi workers
హైదరాబాద్ కవాడిగూడలోని కార్మిక బీమా ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో హెచ్డీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. తమకివ్వాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జీతాలు చెల్లించాలంటూ ఈఎస్ఐ డిస్పెన్సరీ హెచ్డీసీ కార్మికుల ధర్నా
గత పదహారేళ్లుగా కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని.. ఆర్థిక శాఖ మంత్రి స్పష్టత ఇచ్చినా అధికారులు మాత్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వాపోయారు. 120 మంది కార్మికుల్లో 80 మందిని కాంట్రాక్టర్లు అకారణంగా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. వారిని వెంటనే విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని కోరారు.
ఇదీ చదవండి:'పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలి'