హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐల బదిలీ జరిగింది. ఈ మేరకు కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తుకారం గేట్ డీఐ గొల్ల తిమ్మప్పను సీసీఎస్‌కు అటాచ్డ్ చేశారు. సీసీఆర్‌బీ, సీసీఆర్‌బీ ట్రాఫిక్ అటాచ్డ్‌గా ఉన్న ఎరబోయిన జాంగీర్ యాదవ్‌ను ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీ - telangana news
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐల బదిలీ జరిగింది. ఈ మేరకు నగర కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐలు 24 గంటల్లో కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీఐల బదిలీ
ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మురళీకృష్ణను సీపీ ఆఫీస్‌కు బదిలీ చేశారు. మున్నూరు కృష్ణను పదోన్నతి కింద సైబర్ క్రైంకు బదిలీ చేశారు. ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న చెవ్వ శంకర్ రెడ్డిని ఐటీ సెల్‌కి పంపారు. సీఐలు 24 గంటల్లో కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Dharani Portal: భూ సమస్య ఏదైనా ఇక ఫిర్యాదు సులువు
Last Updated : Jun 29, 2021, 10:20 AM IST