దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ విచారణ జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషన్ విచారణ చేస్తోంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో దర్యాప్తు అధికారిగా ఉన్న సురేందర్ రెడ్డిని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారిస్తుంది. పోలీసు అధికారులతోపాటు ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులతోనూ కమిషన్ మాట్లాడనుంది.
DISHA CASE: నేటి నుంచి మూడ్రోజులపాటు సాగనున్న సిర్పూర్కర్ కమిషన్ విచారణ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై ఏర్పాటైన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ నేటి నుంచి మూడ్రోజుల పాటు సాగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం 18 మంది సాక్షులను కమిషన్ విచారించనుంది.
నేటి నుంచి మూడ్రోజులపాటు సాగనున్న సిర్పూర్కర్ కమిషన్ విచారణ
మూడు రోజులపాటు మొత్తం 18 మంది సాక్షులను విచారించనున్నట్లు తెలిపింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావొద్దంటూ మృతుల కుటుంబసభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని... వారికి భద్రత కల్పించాలని కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు భద్రత కల్పించారు.
ఇదీ చూడండి:పది వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు