సినీ అవకాశాల పేరుతో బోయిన్పల్లిలో మహిళను మోసం చేసిన ముగ్గురు నిందితులను మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కారు, 19 గ్రాముల బంగారం, 11 తులాల వెండి, 65 వేల నగదు, 4 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
సినీ అవకాశాల పేరుతో మోసం - బోయిన్పల్లిలో మహిళను మోసం
సినిమాలో అవకాశం వస్తుందని ఆశపడింది కానీ.. చివరికి డబ్బును కోల్పోయింది. సినీ అవకాశాల పేరుతో మహిళను మోసం చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
సినీ అవకాశాల పేరుతో మోసం
ఆదిత్య అనే వ్యక్తి సినీ నిర్మాతగా పరిచయం చేసుకొని ఓ మహిళను మాయ మాటలతో నమ్మించాడు. ప్రముఖ దర్శక నిర్మాతలు తీయబోయే చిత్రంలో అవకాశం కల్పిస్తానని మహిళ నుంచి విడతల వారీగా 50లక్షలు వసూలు చేశాడు. ఎంత వేచిచూసినా అవకాశం ఇవ్వకపోవడంతో, చివరకు మోసపోయాయని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి : సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు