కరోనాపై పోరాటంలో పోలీసులు, వైద్యులతో సహా విధులు నిర్వహిస్తోన్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దాతృత్వాన్ని చాటుకున్నారు. జీహెచ్ఎంసీ నార్త్‌జోన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి రోజు 1000 మందికి సరిపడా బాదం పాలు పంపిణీ చేస్తున్నారు. నెలరోజుల పాటు జీహెచ్ఎంసీ కార్మికులకు బాదంపాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
రోజు 1000 మందికి బాదం పాలు: శేఖర్ కమ్ముల - shekar kammula distributes badam milk
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్త్‌జోన్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రోజు.. 1000 మందికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల బాదంపాలు పంపిణీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నార్త్‌జోన్ కార్యాలయంలో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి శేఖర్ కమ్ముల పారిశుద్ధ్య కార్మికులకు బాదంపాలు పంపిణీ చేశారు. ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చడం వల్ల పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా తనవంతు బాధ్యతగా బాదంపాలు పంపిణీ చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల తెలిపారు. శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి తలసాని అభినందించి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు: బండి సంజయ్