ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని వ్యాపారాలపై ఈ ఎఫెక్ట్ పడుతోంది. భారత మార్కెట్లపైనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. సినిమా రంగం దీనికి అతీతమేం కాదు.
'కరోనా' ప్రభావంతో థియేటర్లు బంద్ - థియేటర్లు బంద్
ఆడపిల్ల.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేదీ.. కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. అలాగే.. 'కరోనా వైరస్' ప్రభావానికి ఇదీ, అదీ అని తేడా లేకుండా పోయింది. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడుతోంది. ఈ వైరస్ ప్రభావానికి అన్ని రంగాలు గజగజ వణికిపోతున్నాయి. జన సంచారం ఎక్కువగా ఉండే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్లకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి.
!['కరోనా' ప్రభావంతో థియేటర్లు బంద్ cinema Theaters closed in Telugu states because of Corona Virus Effect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6402125-627-6402125-1584138212840.jpg)
'కరోనా దెబ్బకు' థియేటర్లు బంద్
ఇప్పటికే కేరళ, కర్ణాటకలోని సినీ నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా సమావేశమై మార్చి 31 వరకు సినిమా థియేటర్లను మూసివేశాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని నిర్మాతల మండలి భావిస్తోంది. పైగా కరోనా వ్యాపిస్తుందన్న వదంతులతో ఈ ఉగాదికి విడుదల కావాల్సిన పలు పెద్ద సినిమాలను నిర్మాతలు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఇవీచూడండి:భారత్లో కరోనాతో మరో వ్యక్తి మృతి
Last Updated : Mar 14, 2020, 9:38 AM IST