హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనశాల పుస్తకాల ఆవిష్కరణకు కేంద్రంగా మారడంతో పాటు సినిమా టీచర్లకు కూడా వేదికగా మారింది. పల్లెవాసి సినిమా టీజర్‌ను పలువురు ప్రముఖులు విడుదల చేశారు.
పుస్తక ప్రదర్శనలో సినిమా టీజర్ విడుదల - pallevasi teaser released
భాగ్యనగరంలో జాతీయ పుస్తక ప్రదర్శనశాల పలు కార్యక్రమాలకు వేదికగా మారుతోంది. వేలాది మంది పుస్తక ప్రియులు ప్రతి రోజూ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు పుస్తక ఆవిష్కరణలు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా పల్లెవాసి సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
పుస్తక ప్రదర్శనశాలలో సినిమా టీజర్ విడుదల
ప్రస్తుత తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో మారే పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారని సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. గోరంట్ల సాయి ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. పల్లె వాసి సినిమా విజయవంతం కావాలని పలువురు ఆశీర్వదించారు.
ఇదీ చూడండి : వనస్థలిపురంలో వృథాగా పోతున్న తాగు నీరు