ఆదివారం అనగానే సినిమాలకు వెళ్దామా.. షాపింగ్‌కి వెళ్దామా అని ప్రజలు ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరుకు అనునిత్యం సినిమా ప్రేక్షకులతో రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని హాల్స్ బోసిపోయాయి.
ఆర్టీసీ క్రాస్‌రోడ్ వెలవెలబోతోంది! - సినీ ప్రేక్షకులు
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సినిమా హాళ్లన్నీ బోసిపోయాయి. ఆదివారం సినిమా చూద్దామని వెళ్లిన ప్రజలకు సినిమా థియేటర్లు మూసివేసి ఉండడం వల్ల నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు.
నిరాసతో థియోటర్ల నుంచి వెనుదిరిగుతున్న సినీ ప్రేక్షకులు
కరోనా బారి నుంచి ప్రజలను రక్షించడం కోసం ప్రభుత్వం అన్ని జన సమూహ కేంద్రాలను మూసి వేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సినిమా హాల్స్, విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కాగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ 35, దేవీ, సంధ్య, శ్రీ మయూరి, సప్తగిరి సినిమా థియేటర్లన్నింటినీ మూసివేశారు. సినిమా చూడడానికని అనేకమంది సినిమా థియేటర్స్‌కు వచ్చి తిరిగి వెళుతున్నారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్