Cine Writer Suspicious Death at Film Nagar: సినిమానే జీవనం అనుకుని తన జీవితం మొదలుపెట్టాడు. ఎన్నో సినిమా కథలు రాశాడు. నిజ జీవితాలను చూస్తూ.. దానికి తగ్గట్టుగా కథలో ఎన్నో పాత్రలను సృష్టించాడు. పాత్రలు ఏవైనా.. ఓ రచయితగా ప్రాణం పెట్టి రాసి వాటికి జీవం పోశాడు. తాను రాసుకున్న కథలను వెండి తెర మీద చూసుకుని మురిసిపోదాం అని అనుకున్నాడు.
Cine Writer Suspected Death News : ఒక్క ఛాన్స్.. అంటూ ఆ కథా రచయిత సినిమా ఆఫీస్ల చుట్టూ తిరిగాడు. వందలాది కథలు రాసుకొని ఒక్క అవకాశం రాకపోదా అని ఎదురు చాశాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. తాను రాసిన కథలు ఎవరూ వినడం లేదన్న బాధతో 'ఇక అంతా అయిపోయింది'.. అనుకొని డిప్రెషన్లోకి వెళ్లాడు. వందలాది కథలు రాసుకుని.. తన 'కథ'ను అర్ధాంతరంగా ముగించుకున్నాడు. గది నిండా కథలు.. మది నిండా ఆశలు.. ఇంతలో ఏమైందో ఏమో గానీ అనుకొని రీతిలో గదిలో మృతి చెంది ఉన్నాడు ఓ సినీ కథా రచయిత. చివరకు మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకూ ఎవరూ లేకపోవడంతో మార్చురీకి తరలించారు. ఈ ఘటన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.