డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు వేధిస్తున్నాడని వరంగల్‌కు చెందిన యువతి ఆరోపించింది. రక్షణ కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఫిర్యాదు చేసింది. లారెన్స్ సోదరుడు వినోద్ ప్రేమను నిరాకరించినందుకు... లైంగికంగా వేధించడంతో పాటు వ్యభిచార కూపంలోకి దించాలని చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. వినోద్ చేస్తున్న చీకటి వ్యాపారాలు తనకు తెలుసని అందుకే చంపాలనుకుంటున్నాడని తెలిపింది. కులం పేరుతోనూ దూషించాడని పేర్కొంది.
రాఘవ లారెన్స్ సోదరుడు వేధిస్తున్నాడు: సినీ ఆర్టిస్ట్ - Cine artist Divya complains that choreographer Lawrence is being harassed
డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ సోదరుడు వేధిస్తున్నాంటూ వరంగల్‌కు చెందిన యువతి... రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. లారెన్స్ సోదరుడు వినోద్ ప్రేమను నిరాకరించినందుకు.... లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని జూనియర్ ఆర్టిస్ట్ దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. లారెన్స్ సోదరుడి నుంచి ప్రాణ హాని ఉందని... తనను కాపాడాలని బాధితురాలు వేడుకుంది.
![రాఘవ లారెన్స్ సోదరుడు వేధిస్తున్నాడు: సినీ ఆర్టిస్ట్ lawrence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6359444-1067-6359444-1583840257484.jpg)
lawrence
హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా... అక్కడి సీఐ వాళ్లతో కుమ్మక్కై తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపింది. జైలుకు పంపించారని బాధితురాలు పేర్కొంది. లారెన్స్ సోదరుడి నుంచి ప్రాణ హాని ఉందని... తనను కాపాడాలని కోరింది.
రాఘవ లారెన్స్ సోదరుడు వేధిస్తున్నాడు: సినీ ఆర్టిస్ట్
ఇవీ చూడండి:రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
Last Updated : Mar 10, 2020, 5:11 PM IST