మగువల కోసం సంప్రదాయ, పాశ్చాత్య వస్త్రాలు, ఆకట్టుకునే సరికొత్త డిజైన్ల ఆభరణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ప్రదర్శన కొలువుదీరింది. 'డిజైర్ డిజైన్' పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను వర్ధమాన సినీ నటి శ్రావణి ప్రారంభించారు. స్టాల్స్‌ను సందర్శించి.. వస్త్రాభరణాలను ధరిస్తూ సందడి చేశారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ..
రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శనలో మగువలకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులను ఒకే వేదికపై ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని శ్రావణి వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న అనేక రంగాలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే జీవనం సాగించాలని సూచించారు.
రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు అనితా అగర్వాల్ తెలిపారు.
చూపుతిప్పుకోనివ్వని సరికొత్త మోడల్స్‌తో ఇదీ చదవండి:తొలి మహిళా మైన్ మేనేజర్‌కు ఎమ్మెల్సీ కవిత అభినందన