తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇజ్రాయిల్​లో పర్యటించనున్న పారిశ్రామికవేత్తల బృందం - business

ఈ నెల 16 నుంచి 21 వరకు రాష్ట్ర పారిశ్రామికవేత్తల బృందం ఇజ్రాయిల్​లో పర్యటించనుంది. తెలంగాణలోని చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై ఈ బృందం దృష్టి సారించనుంది.

ఇజ్రాయిల్​లో పర్యటించనున్న పారిశ్రామికవేత్తల బృందం

By

Published : Nov 12, 2019, 9:36 PM IST

తెలంగాణలోని చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు కల్పించటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో తోడ్పాటునందించేందుకు రాష్ట్ర పారిశ్రామికవేత్తల బృందం ఇజ్రాయిల్​లో పర్యటించనుంది. నవంబర్ 16 నుంచి 21 వరకు భారత పారిశ్రామిక సమాఖ్య ఆధ్వర్యంలో 16 మంది వాటర్ టెక్నాలజీస్ ఎగ్జిబిషన్​తో పాటు వివిధ పరిశ్రమలను సందర్శించనున్నారు. వ్యవసాయం, జలవనరులు, పునరుత్పాదక శక్తి, ఆరోగ్య రంగాల్లో అక్కడి పరిశ్రమల నుంచి సహకారం మరింత పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. అందుబాటు ధరల్లో అవసరమైన సాంకేతికతపై ఈ బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు తెలిపింది.

ఇజ్రాయిల్​లో పర్యటించనున్న పారిశ్రామికవేత్తల బృందం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details