తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ పొడిగింపున​కు సీఐఐ మద్దతు - లాక్​డౌన్​ సీఐఐ తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ పొడిగింపునకు సీఐఐ మద్దతు తెలిపింది. కొవిడ్​-19 నివారణకు లాక్​డౌన్​ పొడిగించడం తప్పనిసరని సీఐఐ రాష్ట్ర ఛైర్మన్ బోదనపు కృష్ణ అన్నారు.

భారత పరిశ్రమల సమాఖ్య
భారత పరిశ్రమల సమాఖ్య

By

Published : Apr 15, 2020, 10:16 AM IST

ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్ పొడిగింపును భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సమర్థించింది. లాక్​డౌన్ వల్ల చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు సవాళ్లను ఎదుర్కుంటున్నాయని సీఐఐ తెలంగాణ ఛైర్మన్ బోదనపు కృష్ణ తెలిపారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తి నివారణకు లాక్​డౌన్ పొడిగించడమే శరణ్యమని చెప్పారు. ప్రజలకు ఉపాధి కల్పిస్తూనే ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహించడం అవసరమని వ్యాఖ్యానించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ... ఆర్థిక కార్యకలాపాలను దశల వారీగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details