తెలంగాణ

telangana

ETV Bharat / state

Suchitra Ella: ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: సుచిత్ర ఎల్లా - సీఐఐ

Suchitra Ella: దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనకు సీఐఐ కృషి చేస్తోందని సదరన్ రీజియన్ నూతన ఛైర్​పర్సన్ సుచిత్ర ఎల్లా పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐఐ ఛైర్​పర్సన్ హోదాలో హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

Suchitra Ella
Suchitra Ella

By

Published : Jul 20, 2022, 8:11 PM IST

Suchitra Ella: ఫార్మా, ఐటీ రంగాల్లో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని సీఐఐ నూతన ఛైర్​పర్సన్​ సుచిత్ర ఎల్లా అన్నారు. రాష్ట్రంలోను ఐదు లక్షల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు. సీఐఐ ఛైర్​పర్సన్ హోదాలో హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

మొత్తం రీజియన్​కు 25 లక్షల ఉద్యోగాలు అనుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే మేం ముందుకెళ్తాం. ఐదు రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనకు తమ వంతు కృషి చేస్తాం.-సుచిత్ర ఎల్లా, సీఐఐ నూతన ఛైర్​పర్సన్​

దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని సుచిత్ర ఎల్లా తెలిపారు. రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్​గా మార్చే దిశగా సీఐఐ తన వంతు కృషి చేస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ సహకారంతో సీఐఐ పని చేస్తుందని ప్రకటించారు.

తెలంగాణలో వరంగల్, నిజామాబాద్​లలో పరిశ్రమల అభివృద్ధికి సీఐఐ కృషి చేస్తుందని సుచిత్ర ఎల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ను లాజిస్టిక్స్ హబ్​గా మార్చేందుకు అక్కడి ప్రభుత్వంతో కలిసి తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు. ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఐఐ గ్రీన్ ఇనిసియేటివ్స్ చేపట్టినట్లు ప్రకటించారు.

ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: సుచిత్ర ఎల్లా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details