CID officials instructions to Krushi Cooperative Bank depositors: కృషి సహకార బ్యాంకు డిపాజిటర్లు ఎవరైనా డబ్బు తీసుకోకపోతే దరఖాస్తు చేసుకోవాలని సీఐడీ అధికారులు సూచించారు. 2001లో డిపాజిటర్లకు చెల్లింపులు చేయకుండా చేతులెత్తేసిన కృషి సహకార బ్యాంకుపై మహంకాళి పీఎస్‌లో కేసు నమోదైందని సీఐడీ అధికారులు తెలియజేశారు. అధికారులు దర్యాప్తు చేపట్టి, సదరు బ్యాంకుకు చెందిన డైరెక్టర్ల ఆస్తులు జప్తు చేశారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు చెల్లించడానికి నాంపల్లి కోర్టు ఆదేశాలను ఇచ్చింది.
'ఆ 100 మంది డిపాజిటర్లు డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోవాలి' - కృషి సహకార బ్యాంకు
CID officials instructions to Krushi Cooperative Bank depositors: 2001లో డిపాజిటర్ల నుంచి నిలువు దోపిడీ చేసి దివాలా తీసిన కృషి సహకార బ్యాంకు విషయంలో సీఐడీ అధికారులు ఈ రోజు ప్రస్తావించారు. అప్పటి డిపాజిటర్లకు ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సి ఉంటే సరైనా ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

cid
అందువల్ల బ్యాంకుతో పాటు నిందితులకు చెందిన ఆస్తులను వేలం వేశారు. వచ్చిన డబ్బులు ఇప్పటికే 700 మంది డిపాజిటర్లకు పంపిణీ చేశారు. ఇంకా 100మంది డిపాజిటర్లు డబ్బులు తీసుకోలేదని సీఐడీ అధికారులు గుర్తించారు. డిపాజిట్ చేసిన ఆధారాలు, చిరునామాతో నాంపల్లిలోని గృహకల్ప కాంప్లెక్స్‌లో ఉన్న కృషి సహకార బ్యాంకు లిక్విడేటర్‌ను సంప్రదించాలని సీఐడీ అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: