Bail Granted To MLC Ashok Babu: తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్ వచ్చింది. అర్ధరాత్రి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేయగా... ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన విడుదలయ్యారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం రాజకీయ కక్షలకు స్వస్తి చెప్పకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని అశోక్‌బాబు హెచ్చరించారు.
వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్నప్పుడు పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు విజయవాడలోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి విజయవాడలోని సీఐడీ ఇన్‌ఛార్జ్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మొదట బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేసిన అధికారులు.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా 467 సెక్షన్ పెట్టారని అశోక్‌బాబు తరఫు న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్ చేశారని అన్నారు.
ఇటీవలే అశోక్‌బాబు గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగంలో ఉండగా పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 467 సెక్షన్ పెట్టినందున రిమాండ్‌కు పంపాలని విన్నవించారు. ఇరువైపు వాదనలు విన్న సీఐడీ న్యాయమూర్తి.. అర్ధరాత్రి అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేశారు. కోర్టు ఆదేశం మేరకు రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించి అశోక్‌బాబు విడుదలయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్ట్ చేశారని.. దీనివెనక పీఆర్సీ సాధన సమితిలోని కొందరు నేతలున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. అశోక్‌బాబుపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమ చెప్పారు.
అప్రజాస్వామిక అరెస్టు: తెదేపా