పదోన్నతి రాలేదని సీఐ ఆత్మహత్య...! - police suicide in vijayawada
పదోన్నతి రాలేదని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో చోటుచేసుకుంది. వెకెన్సీ రిజర్వ్‌లో ఉన్న సీఐ సూర్యనారాయణ ఉరివేసుకొని చనిపోయాడు.
విజయవాడ హనుమాన్‌పేట పోలీస్ క్వార్టర్స్‌లోసీఐ సూర్యనారాయణ ఆత్మహత్య కలకలం రేపింది. పదోన్నతి రాలేదనే కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తన తరువాతి బ్యాచ్‌లో చాలా మంది డీఎస్పీలు అయినా తనకు పదోన్నతి రాలేదని బాధపడేవాడని బంధువులు అభిప్రాయపడ్డారు. ఇటీవలే సూర్యనారాయణ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.