తెలంగాణ ఎన్నడూ ఫ్యూడల్ వ్యవస్థను భరించదని... ప్రజల్లో వాటి వ్యతిరేక రక్తకణాలు ఇంకా ఉన్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పైలా వాసుదేవరావు స్మారక ఉపన్యాసానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... సాయుధ పోరాటం పునరావృతమైనప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. వాసుదేవరావు ఉద్యమసెగ చిక్కోలులో ఇంకా చల్లారలేదని... మరోసారి ఉద్ధృతమవుతుందని పేర్కొన్నారు.
'తెలంగాణ ఫ్యూడల్ వ్యవస్థను భరించలేదు' - చుక్కా రామయ్య
శ్రీకాకుళంలో పైలా వాసుదేవరావు ఉద్యమ సెగ మరోసారి పునరావృతమవుతుందన్నారు ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల్లో ఫ్యూడల్ వ్యవస్థ వ్యతిరేక కణాలు ఇంకా ఉన్నాయని అన్నారు.
చుక్కా రామయ్య