'క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..' - బాపిస్ట్చర్చి
హైదరాబాద్ నారాయణగూడ బాప్టిస్టు చర్చిలో జరిగిన జంట నగరాల బిషప్స్, ఫాదర్స్ సమావేశానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవులు దహన సంస్కరాలు చేసుకోవడాని భూమిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
మరణాంతరం చేసే దహన కార్యక్రమాలకు స్థలం లేకుండా వివిధ కులాల, మతాల ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వాపోయారు. ముఖ్యంగా క్రైస్తవులు ఒకే సమాధిలో అనేక మందిని పూడ్చిపెడుతున్నారని వివరించారు. హైదరాబాద్ నారాయణగూడ బాపిస్ట్ చర్చిలో జరిగిన జంట నగరాల బిషప్స్ , ఫాదర్స్ నిర్వహించిన సమావేశానికి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్...గ్రామ, మండల,నగరాల్లో స్మశానవాటికలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నారని వెల్లడించారు. క్రైస్తవుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.