ఏపీ శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం రేగింది. ఆలయానికి సమీపంలోని దళిత కాలనీకి చెందిన ఓ కుటుంబానికి కర్నూలులోని క్రిస్టియన్ సంస్థ ద్వారా ఓ పార్శిల్ వచ్చింది. ఆర్టీసీ కార్గో ద్వారా స్థానిక బస్టాండ్‌కు రాగా... స్థానికులు గుర్తించి దేవస్థానం అధికారులకు సమాచారం అందించారు. ఆలయ ఇంఛార్జి చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీహరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శ్రీశైలంలో కలకలం రేపిన అన్యమత పార్శిల్ - శ్రీశైలం తాజా వార్తలు
ఏపీ శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం రేపింది. పర్యాటకశాఖ ఉద్యోగి కుటుంబానికి క్రిస్టియన్ సంస్థ నుంచి పార్శిల్ వచ్చినట్లు సమాచారం. దేవస్థానం అధికారులు పార్శిల్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

పోలీసులు ఆ పార్శిల్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. ఆలయంలోని పర్యాటక శాఖలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగి కుటుంబానికి పార్శిల్ వచ్చినట్లు చిరునామా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో నిత్యావసర వస్తువులను సదరు క్రిస్టియన్ సంస్థ పంపినట్లు తేలింది. దేవాదాయ, ధర్మాదాయ చట్టం ప్రకారం శ్రీశైలంలో అన్యమత ప్రచార కార్యకలాపాలు నిషేద్ధం. అన్యమత పార్శిల్ కర్నూలు నుంచి శ్రీశైలానికి రావడంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి :గొంతులో పల్లీ ఇరుక్కుని పదకొండు నెలల చిన్నారి మృతి