తెలంగాణ

telangana

ETV Bharat / state

వెలుగు జిలుగుల మధ్య 'క్రిస్మస్' సంబరాలు - ఘనంగా 'క్రిస్మస్' వేడుకులు

క్రిస్మస్​ సందర్భంగా సికింద్రాబాద్​లోని చర్చిలు సుందరంగా ముస్తాబయ్యాయి. సెయింట్ మేరీస్, వెస్లీ, మిలీనియం, సెయింట్ థామస్ చర్చిలను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.

Christamas Churches Lighting at secundrabad
ఘనంగా 'క్రిస్మస్' వేడుకులు

By

Published : Dec 25, 2019, 8:46 AM IST

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చిలను విద్యుత్ దీపాల అలంకరణతో అందంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. సికింద్రాబాద్​లోని సెయింట్ మేరీస్, వెస్లీ, మిలీనియం, సెయింట్ థామస్ చర్చిలను అంగరంగా వైభవంగా అలంకరించారు. రకరకాల డెకరేషన్​లతో నూతనంగా అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు. ఏసుప్రభు జీవన వృత్తాంతాన్ని తెలియజేసే పశువుల పాకలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఘనంగా 'క్రిస్మస్' వేడుకులు

ఏసు ప్రభువు జన్మదిన వేడుకలు అర్ధరాత్రి నుండే ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు భజనలు, కీర్తనలు, సంగీతంతో ఏసుప్రభు జీవిత గమనాన్ని తెలియజేశారు.

ఇవీ చూడండి:ఇవాళ క్రిస్మస్‌ పర్వదినం

ABOUT THE AUTHOR

...view details