సంక్రాంతి పండుగకు ఇళ్లకు వెళ్లిన వారు తిరిగొచ్చేలోపు ఇళ్లను గుల్ల చేశారు దొంగలు. అల్వాల్ పీఎస్ పరిధిలో ఉన్న నాలుగు ఇళ్లను దోచుకెళ్లారు. ఊరెళ్లి తిరిగొచ్చి చూసేలోపు తాళం పగులగొట్టి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగతనం జరిగిందని గుర్తించిన యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి... క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.
పండగకి ఇంటికెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్లైంది - పండగకి ఇంటికెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్లైంది
సంక్రాంతి పండుగను ఊళ్లో అందరి మధ్య జరుపుకుందామని వెళ్లారు. హాయిగా నాలుగు రోజులు గడిపి వచ్చేసరికి తమ ఇళ్లను చూసి ఖంగుతిన్నారు. ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించి బోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు.

పండగకి ఇంటికెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్లైంది
పండగకి ఇంటికెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్లైంది
TAGGED:
CHORI 4 HOUSES AT ALWAL