తెలుగుదేం పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్‌పై వైకాపా మూకలు దాడి చేశారని... తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దాడికి పాల్పడ్డ వారిని తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంస్కృతిక కార్యకలాపాల రూపంలో జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న కక్షతోనే అతనిపై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు.
ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తున్నా చలనం లేదా..?: చంద్రబాబు
తెదేపా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్‌పై దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తున్నా చలనం లేదా..?: చంద్రబాబు
నరసింహప్రసాద్పై దాడి చేయడమంటే ఎస్సీలపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ప్రజలు ఓ వైపు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్తున్నా ఇంకా చలనం లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్ ఎనలేని కృషి : కిషన్ రెడ్డి